Adivi Sesh | లవ్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న స్టోరీ బయటపెట్టిన అడివి శేష్.. కెనడా వరకు సాగిన ప్రేమ!
Adivi Sesh | ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచిన శేష్, ఇప్పుడు తన కొత్త సినిమా డెకాయిట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Adivi Sesh | ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచిన శేష్, ఇప్పుడు తన కొత్త సినిమా డెకాయిట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న శేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి చెప్పడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శేష్ మాట్లాడుతూ, అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని తెలిపాడు. ఆ సమయంలో సినిమాలపై ఆసక్తితో అక్కడే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ, తన వ్యక్తిగత జీవితం కూడా అదే సమయంలో కొత్త మలుపు తిరిగిందని చెప్పాడు. ప్రేమలో మునిగిపోయిన తాను ఆ అమ్మాయి కోసం దేశం దాటి కెనడా వరకు వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే ఆ ప్రేమ కథ ఎక్కువ కాలం నిలవలేదని, చివరికి లవ్ ఫెయిల్యూర్‌తో ముగిసిందని శేష్ చెప్పుకొచ్చాడు. ఆ అనుభవం తన జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పిందని, తరువాత కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టడానికి అదే కారణమైందని వెల్లడించాడు.
ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా అడుగుపెట్టిన శేష్, తన కృషితోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అతను చేసే ప్రతి సినిమా కూడా ప్రత్యేకతతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, డెకాయిట్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రేమకథ బయటకు రావడంతో అభిమానులు శేష్ వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి చూపుతున్నారు. కెరీర్లో విజయాలు సాధించిన అతని జీవితం వెనుక ఇలాంటి భావోద్వేగ కథ ఉందని తెలుసుకుని సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

