అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా నుంచి రెండో పాట ‘చిచ్చు బుడ్డి’ని విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ డ్యాన్స్‌తో అదరగొడుతూ హైఎనర్జీతో కనిపించారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో జానపద శైలి బీట్తో ఈ పాటను కంపోజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, ప్రేమకథ హార్ట్‌టచింగ్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.