Aditya Roy Kapur | షూటింగ్ పూర్తిచేసుకున్న ఆదిత్య రాయ్ కపూర్ ‘గుమ్రాహ్’.. వైరల్ అవుతున్న ఫోటోస్
Aditya Roy Kapur Gumraah Shooting | ‘ఆషికి-2’, ‘ఓకే జాను’, ‘కలంక్’, ‘మలంగ్’ వంటి సినిమాలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య రాయ్ కపూర్. గత కొంత కాలంగా ఈయన హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓమ్’ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం పది కోట్లను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ చిత్రం రాయ్ అభిమానులకు కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆదిత్య ఈ సారి ‘గుమ్రాహ్’తో ఎలాగైనా హిట్ కోట్టాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో వర్ధన్ కేట్కర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం కేక్ కట్ చేసుకుని సంబురాలు చేసుకుంది. సినిమా కోసం ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాం అని తెలిపింది. ఈ చిత్రంలో ఆదిత్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. మొదటి సారిగా ఆదిత్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మృనాళ్ థాకూర్ పోలీస్ అధికారిగా కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సినీ1 స్టూడీయోస్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషన్ కుమార్, మురుద్ కేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య ‘ది నైట్ మేనేజర్’ రీమేక్‌లో నటిస్తున్నాడు. సందీప్ మోడీ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ళ, అనీల్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
A wonderful journey has arrived at its finish line! It’s a shoot wrap for #Gumraah#AdityaRoyKapur @mrunal0801 @PintoVedika #VardhanKetkar @RonitBoseRoy @MuradKhetani #BhushanKumar #KrishanKumar @AnjumKhetani @Cine1Studios @TSeries @aseem_arora #ShivChanana @CastingChhabra pic.twitter.com/bYcaru377C
— T-Series (@TSeries) July 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!
Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు కొడుకు పుడతాడని జోస్యం.. ఇప్పుడు నిజం కావడంతో వైరల్!
వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
KTR | రేవంత్ పాలనలో పల్లె నుంచి పట్నం వరకు అంతా విధ్వంసమే.. ఆర్బీఐ నివేదికపై కేటీఆర్ ధ్వజం
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

