Yami Gautam | థ్రిల్లింగ్‌గా ఉంది.. యామీ గౌతమ్ గుడ్‌న్యూస్
Yami Gautam | మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న భామల్లో ఒకరు యామీ గౌతమ్ (Yami Gautam). ఈ బ్యూటీ 2021లో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యా ధర్ వివాహమాడిన విషయం తెలిసిందే.
Yami Gautam | మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న భామల్లో ఒకరు యామీ గౌతమ్ (Yami Gautam). ఈ హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ రవిబాబు డైరెక్ట్ చేసిన నువ్విలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ 2021లో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యా ధర్ (Aditya Dhar) వివాహమాడిన విషయం తెలిసిందే.
ఈ స్టార్ కపుల్ శుభవార్తను అందరితో షేర్ చేసుకున్నారు. ఇద్దరు దంపతుల ఇంట బుడతడు అడుగు పెట్టాడు. యామీగౌతమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని అధికారికంగా అందరితో పంచుకుంది. సూర్య హాస్పిటల్ డాక్టర్ భూపేందర్ అవస్థి, డాక్టర్ రంజనా ధనుతోపాటు అసాధారణమైన అంకితభావం గల నిపుణులైన వైద్యబృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆస్పత్రి వైద్యుల నైపుణ్యం, అవిశ్రాంత కృషి మా ఈ ఆనందకరమైన సందర్భాన్ని సాకారం చేసిందంటూ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది యామీగౌతమ్.
పవిత్రమైన అక్షయ తృతీయ నాడు వచ్చిన మా ముద్దుల కొడుకు వేదవిద్ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. దయచేసి అతనికి మీ ఆశీర్వాదాలు అందించండి.. ప్రేమ వర్షం కురిపించండి…అంటూ అందరినీ కోరింది. యామీగౌతమ్-ఆదిత్యాధర్ దంపతులకు ఆయుష్మాన్ ఖురానా, మృణాళ్ ఠాకూర్, ప్రియమణి, రణ్వీర్ సింగ్, నేహా ధూపియాతోపాటు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

