Vikram ‘Cobra’ Song | విక్రమ్ ‘కోబ్రా’ నుంచి ‘అధీరా’ సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న ఏఆర్ రెహమాన్ సంగీతం!
Vikram Cobra Song | విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే నటుడు విక్రమ్. పేరుకు అరవ హీరోనే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు విభిన్న వేరియేషన్లను చూపిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్టులేని విక్రమ్‌కు ‘మహాన్’ మంచి కంబ్యాక్ ఇచ్చింది. అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గతంలోనే ప్రారంభమైంది. కానీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. కాగా ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్ను ప్రకటిస్తూ సినిమాపై అటెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అధీరా లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ధీరా ధీరాది ధీరా తుపాకీ మందీరా’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. పా విజయ్ సాహిత్యం అందించిన ఈ పాటను వగు మజాన్ ఆలపించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట క్యచీగా రాప్ ట్యూన్‌తో ఆకట్టుకుంటుంది. సెవన్ స్కీన్ స్టూడీయోస్ పతాకంపై ఎస్ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. విక్రమ్‌కు జోడీగా కేజీఎఫ్ భామ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, దర్శకుడు కేఎస్ రవికుమార్, మర్నాలినీ రవి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

