Vidya Balan | తన పేరు మీద ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై అగ్ర కథానాయిక విద్యాబాలన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి విద్యాబాలన్ పేరు మీద ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అది విద్యాబాలన్ ఒరిజినల్ ఇన్స్టా అకౌంట్ ఐడీకి దగ్గరగా ఉండటంతో చాలా మంది ఫాలో కావడం మొదలుపెట్టారు.
ఇదే అదనుగా సదరు వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఫాలోవర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం విద్యాబాలన్ దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఆ నిందితున్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తన పేరు మీద ఉన్న నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీలను రిపోర్ట్ చేయాలని విద్యాబాలన్ అభిమానులను కోరింది.