Trisha Marriage | కథానాయికగా త్రిష కెరీర్‌కు 21ఏళ్లు. నేటికీ తరగని అందంతో మెరిసిపోతుంటారామె. కెరీర్ పరంగా ఓ హీరోయిన్‌కి ఇంత లాంగ్విటీ ఉండటం అరుదు. ఫార్టీప్లస్లోనూ కథానాయికగా తన సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళం, మలయాళం కలుపుకొని ఓ అరడజను సినిమాలున్నాయి. రాబోతున్న విజయ్, లోకేశ్ కనకరాజ్ ‘లియో’లో త్రిషే కథానాయిక. ఓ వైపు ఆమె కెరీర్ ఇంత పీక్స్‌లో ఉంటే.. మరోవైపు ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కానీ పెళ్లి మాత్రం ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు కోలీవుడ్ మీడియాలో బలంగానే వినపడుతున్నాయి. ఆమె ఓ మలయాళ నిర్మాతను పెళ్లాడబోతున్నారట. గతంలో అతని దర్శకత్వంలో త్రిష నటించిందట. ఆ సమయంలోనే ఇద్దరిమధ్య ప్రేమ చిగురించిందనీ, త్వరలో అతనితో త్రిష పెళ్లిపీటలెక్కనున్నారని సమాచారం. ఈ ఏడాదే పెళ్లి అని టాక్. మరి ఇందులో నిజం ఎంతుందో చూడాలి.