Regina | థియేటర్లోకి వస్తుందనుకుంటే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థిల్లర్
Regina | శ్రీవిష్ణు హీరోగా వచ్చిన రాజ రాజ చోర సినిమాలో కథానాయికగా మెప్పించిన సునయిన గుర్తుందా! ఆ సినిమా హిట్ కావడంతో బ్రేక్ వస్తుందని అనుకున్నప్పటికీ సునయినకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఆ సినిమా పేరు రెజీనా.
Regina | శ్రీవిష్ణు హీరోగా వచ్చిన రాజ రాజ చోర సినిమాలో కథానాయికగా మెప్పించిన సునయిన గుర్తుందా! ఆ సినిమా హిట్ కావడంతో బ్రేక్ వస్తుందని అనుకున్నప్పటికీ సునయినకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఆ సినిమా పేరు రెజీనా. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. గత ఏడాది జనవరి 23న ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తెలుగులో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ సరిగ్గా అదే రోజున తెలుగు సినిమాలు ఉండటంతో రెజీనా మూవీకి థియేటర్లు పెద్దగా దొరకలేదు. కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో చేసేదేమీ లేక అనుకున్న టైమ్‌కు కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు మేకర్స్.
మంచి అంచనాల మధ్య తమిళంలో విడుదలైన రెజీనా సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా డిజాస్టర్ కావడంతో ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదు. దీంతో ఇతర భాషల్లో విడుదల చేయాలన్న ఆలోచనను మేకర్స్ విరమించుకున్నారు. అప్పట్నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇన్నాళ్లకు అంటే దాదాపు 8 నెలల తర్వాత ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నది. నిజానికి రెజీనా మూవీ తమిళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఉంది. ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ వర్షన్‌ను కూడా ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
భర్త మరణంపై ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకున్నదే కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్‌గా రెజీనా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్ ఫేమ్ అనంత నాగ్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కంటెంట్‌లో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఓటీటీలో అయినా ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను మెప్పిస్తుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cinema news
- ott
- prime videos
- regina
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

