పుత్రోత్సాహంలో ఆనందపడుతున్నది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మంగళవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఇంటి సభ్యుడికి ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఆహ్వానం పలికారు. కాజల్ తైల్లెన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంది కాజల్. ఈ ఏడాది జనవరిలో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది.
వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటున్నది కాజల్. అప్పటికే ఒప్పుకున్న ఇండియన్ 2, ఘోస్ట్ సినిమాలను వదిలేసింది. కుటుంబానికే పూర్తి సమయం కేటాయిస్తున్నది. మాతృత్వంతో జీవితంలో కొత్త బాధ్యతలు తీసుకోనుందీ తార.