Dipika Chikhlia | రామాయణాన్ని సినిమాగా తీయొద్దట.. ఎందుకో చెప్పిన దీపికా చిహ్లియా
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణాన్ని నేటి తరంలో సినిమాగా తీయకపోవడమే మంచిదని సూచించారు నటి దీపికా చిహ్లియా. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన అలనాటి రామాయణ ధారావాహికలో సీత పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది దీపికా చిహ్లియా.
Dipika Chikhlia | భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణాన్ని నేటి తరంలో సినిమాగా తీయకపోవడమే మంచిదని సూచించారు నటి దీపికా చిహ్లియా. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన అలనాటి రామాయణ ధారావాహికలో సీత పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది దీపికా చిహ్లియా. ‘ఆదిపురుష్’ తర్వాత రామాయణగాథ మరోమారు భారతీయ వెండితెరపై దృశ్యమానం కాబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాముల పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామాయణ నేపథ్య సినిమాలపై దీపికా చిహ్లియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమకాలీన పరిస్థితుల్లో రామాయణ ఇతిహాసాన్ని సినిమాలుగా తీయొద్దని, కొత్తదనం పేరుతో రామాయణ ప్రాశస్త్యాన్ని, పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆమె అభిప్రాయపడింది.
“ఆదిపురుష్’ సినిమాలో రామాయణం తాలూకు ప్రామాణికత మిస్ అయింది. సీతా దేవి పాత్రను గులాబీ రంగు చీరలో, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం బాగోలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం తాలూకు గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికిపోకుండా యువతలో స్ఫూర్తినింపే స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది’ అని దీపికా చిహ్లియా సలహా ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

