Avanthika Mishra | మీకు మాత్రమే చెప్తా.. జిందగీతో ఓపెన్ అయిన అవంతిక మిశ్రా
చాలామంది కాలక్షేపానికి సినిమాలు చూస్తారు. నా తరహా వేరు. సినిమాను స్కూల్లో పాఠంగా భావించేదాన్ని. అలా నటనపై మోజు పెంచుకున్నా! కెమికల్ ఇంజినీరింగ్ చదివిన నేను యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి రాలేదు. యాక్టింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలని చదువుకునే రోజుల్లోనే ఫిక్సయ్యాను! నా అభిరుచి తెలిసి మా అమ్మానాన్న ఓకే అన్నారు.
‘మాయ’ సినిమాతో టాలీవుడ్లోకి ఓ అనుకోని అతిథి వచ్చింది. వచ్చినావిడ ఊరికే ఉందా అంటే.. తన అందంతో ప్రేక్షకుల మతులు గతి తప్పేలా చేసింది. అభినయంతో అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. తాజాగా డిస్నీ-హాట్‌స్టార్‌లో ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో ‘మాయ’గా కాసేపు కవ్వించింది, మరికాసేపు భయపెట్టింది, మొత్తంగా అదరగొట్టింది. ఇంతకీ ఈ మాయా అతిథి ఎవరో చెప్పలేదు కదూ! ఆమె పేరు అవంతిక మిశ్రా. తనను పలకరించగానే ‘మీకు మాత్రమే చెప్తా’నంటూ ‘జిందగీ’తో ఎన్నో సంగతులు పంచుకుంది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే…

చాలామంది కాలక్షేపానికి సినిమాలు చూస్తారు. నా తరహా వేరు. సినిమాను స్కూల్లో పాఠంగా భావించేదాన్ని. అలా నటనపై మోజు పెంచుకున్నా! కెమికల్ ఇంజినీరింగ్ చదివిన నేను యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి రాలేదు. యాక్టింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలని చదువుకునే రోజుల్లోనే ఫిక్సయ్యాను! నా అభిరుచి తెలిసి మా అమ్మానాన్న ఓకే అన్నారు. ‘ఇండస్ట్రీలో మనకంటూ ఎవరూ తెలియదు. స్వశక్తిని నమ్ముకో. మా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అన్నారు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచీ నా అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు. మా నాన్న ఎమ్కే మిశ్రా ఎయిర్‌ఫోర్స్ అధికారి. రిటైర్ అయ్యాక లాయర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ సవిత గృహిణి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు.
రెండేండ్లకో ఊరు
నా బాల్యం ఓ సినిమా కథలా సాగింది. సినిమాల్లో సీన్ సీన్‌కూ లొకేషన్లు మారుతాయి కదా! అలాగన్నమాట!! ఉద్యోగ రీత్యా మా నాన్న రెండేండ్లకో ఊరు మారాల్సి వచ్చేది. దాంతో నా బాల్యం ఎనిమిది నగరాల్లో సాగింది. రెండేండ్లకో ఊరు మారడం వల్ల నాకు అన్ని ప్రదేశాల గురించి తెలిసింది. అక్కడి పద్ధతులు, సంప్రదాయాలపై అవగాహన ఏర్పడింది. రకరకాల భావాలు కలిగిన వ్యక్తులతో పరిచయం వల్ల వయసుకు మించిన పరిణతి కనబరచేదాన్ని. ఏదైనా తొందరగా స్వీకరించే మనస్తత్వం పెరగడానికీ ఇదే కారణం. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్లినా.. అక్కడివాళ్లు నా వాళ్లే అన్న భావన త్వరగా కలుగుతుంది. నన్ను కూడా వాళ్లు అంతే త్వరగా యాక్సెప్ట్ చేస్తుంటారు. సినిమాల్లోనూ అదే కొనసాగుతున్నది.
పాకెట్ మనీ కోసం..
స్కూల్ డేస్‌లో ఆటల్లో చాలా చురుగ్గా ఉండేదాన్ని. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధించాను. ఫిట్నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు. పెద్దయ్యాక మెల్లగా మాడలింగ్ చేయడం మొదలుపెట్టా. పాకెట్ మనీ కోసం యాడ్స్‌లో నటించేదాన్ని. అయితే నా స్నేహితులు, యాడ్ మేకర్స్ ‘నీది కమర్షియల్ ఫేస్‌కట్. సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది’ అనేవాళ్లు. ఆ మాట విన్నప్పుడల్లా నాకూ హ్యాపీగా అనిపించేది. అయితే, సినిమా అవకాశాల కోసం ఎలా ప్రయత్నించాలో కూడా పూర్తిగా తెలిసేది కాదు. ఇలా ఉండగానే అనుకోకుండా డైరెక్టర్ నీలకంఠ సార్ ద్వారా మొదటి అవకాశం వచ్చింది. ఏదో యాడ్ చూసి సంప్రదించారు. ఆడిషన్ కోసం హైదరాబాద్ వచ్చా! అంతకుముందు ఎప్పుడో ఒకసారి బ్యాడ్మింటన్ పోటీల కోసం ఇక్కడికి వచ్చా! హైదరాబాద్ ఎంతో మారిపోయింది అనిపించింది. ఆడిషన్ కేవలం నిమిషాల్లోనే ఓకే అయింది. అలా వినూత్న దర్శకుడిగా పేరున్న నీలకంఠ చిత్రం ‘మాయా’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా!
సినిమాల్లోకి వెళ్తానంటే అమ్మానాన్న నో చెప్పలేదు సరికదా ప్రోత్సహించారు. ‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నావని కంగారుపడాల్సిన పనిలేదు. అక్కడ ఎవరూ తెలియకపోవచు.. కానీ, నువ్వు ఒక సైనికుడి కూతురువని మర్చిపోకు. ఎలాంటి పరిస్థితులనైనా నువ్వు ఎదుర్కోగలవు’ అని అమ్మ ధైర్యం నూరిపోసింది.
పని చేస్తూనే..
‘మాయా’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నటిగా నాకు మంచిపేరు తెచ్చింది. బిగ్‌స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికింకా ఇంజినీరింగ్ పూర్తి కాకపోవడంతో.. దేన్నీ ఒప్పుకోలేదు.
మళ్లీ రెండేండ్లకు ‘మీకు మీరే మాకు మేమే’ తో మరోసారి తెలుగువారిని పలకరించా. నటనలో నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది లేదు. పని చేస్తూనే నేర్చుకున్నా. కెరీర్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. ‘అతిథి’ వెబ్‌సిరీస్‌లో కొత్తగా కనిపించానని చాలామంది అభినందిస్తున్నారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నా. ఒక వెబ్‌సిరీస్ కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. పాన్ ఇండియాకు పర్యాయపదంగా మారిన తెలుగు సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నన్ను ఆదరిస్తున్న తెలుగువారిని సుదీర్ఘకాలం ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా! ఈ జర్నీ సక్సెస్ ఫుల్‌గా సాగుతుందన్న నమ్మకం నాకుంది!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

