Balakrishna- Anil Ravipudi Movie | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అనిల్ ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్‌తో రూపొందిస్తున్నట్లు ఇటీవలే తెలిపాడు.
ఫాదర్- డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రంలో కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తుంది.
కాగా బాలయ్యకు జోడీగా ఎవరనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే గత కొన్ని రోజుల నుండి హీరోయిన్ అంజలి బాలయ్యకు భార్యగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో అంజలిది కీలకపాత్ర అని టాలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణ జరుగుతుందట. త్వరలోనే పాత్రకు తగ్గ హీరోయిన్ను ఫైనల్ చేసి అధికారికంగా వెల్లడించనున్నారని టాక్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టినుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.