కారు ప్రమాదంలో నటి యషికా ఆనంద్‌కు గాయాలు, స్నేహితురాలు మృతి

చెన్నై : నటి, మోడల్, టీవీ పర్సనాలిటీ యషికా ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో యషికా ఆనంద్‌కు గాయాలతో బయటపడగా ఆమె స్నేహితురాలు వల్లిచట్టి భవానీ(28) మాత్రం మరణించింది.
పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన భవానీ యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. భవానీ, యషికా ఆనంద్, మరో ఇద్దరు(పురుష) స్నేహతులు అంతా కలిసి శనివారం రాత్రి మామల్లపురం నుండి చెన్నై వైపుగా కారులో ప్రయాణిస్తున్నారు. కాగా కారు 11.45 గంటలకు ఈస్ట్ కోస్ట్ రోడ్లోకి ప్రవేశించింది.
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కంట్రోల్ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. బాటసారులు, వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వల్లిచట్టి భవానీ మరణించింది. మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

