తిరుమల శ్రీవారిని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శించుకున్నారు. శుక్రవారం ‘కబా’్జ చిత్రం విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉపేంద్ర మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం యావత్తు భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమన్నారు.
గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘కబా’ ్జ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్రవేసిన నటుడు ఉపేంద్ర తాజాగా ‘కబా’్జ చిత్రంలో నటించారు.