Love Mouli Movie | మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా నవదీప్ ‘లవ్ మౌళి’ ఆడియో జూక్ బాక్స్ విడుదల
Love Mouli Movie Juke Box | సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్ మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Love Mouli Movie Juke Box | సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్ మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్ డిఫరెంట్‌గా కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.O గా అభిమానులు వర్ణిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో జూక్ బాక్స్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ చిత్ర పాటలను వినూత్నంగా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలను ఎవరైతే పాడారో.. వారితోనే ఆ పాటను ఈ ఈవెంట్లో పాడించి.. అదే పాటను వారిచేతే విడుదల చేయించారు. అనంతరం పాటలన్నీ కలిపి ఉన్న జూక్‌బాక్స్‌ని స్టార్ హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రవితేజ నటించిన ‘ఈగల్’ చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ‘ఈగల్’ ట్రైలర్ చూస్తుంటే.. నవదీప్ పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందనేది అర్థమవుతోంది. ‘లవ్ ,మౌళి’ సినిమాలోని పాటలను ఇలా వినూత్నంగా విడుదల చేయడం.. అలాగే మాస్ రాజా రవితేజగారు జూక్ బాక్స్ విడుదల చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని హీరో నవదీప్ అన్నారు. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు ‘లవ్ ,మౌళి’ దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నానని నవదీప్ తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్లు: నైరా క్రియేషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం: సి స్పేస్
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత
పాటల రచన: అనంత శ్రీరామ్
ఆర్ట్: కిరణ్ మామిడి
పిఆర్వో: ఏలూరు శ్రీను- మధు మడూరి
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: అవనీంద్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

