బచ్చలమల్లి హిట్ గ్యారెంటీ
‘ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేశా. తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే తపనతో ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు హీరో నాని. శనివారం జరిగిన ‘బచ్చలమల్లి’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేశా. తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే తపనతో ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు హీరో నాని. శనివారం జరిగిన ‘బచ్చలమల్లి’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లరి నరేష్ కథానాయకుడిగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. వర్షంలో అల్లరి నరేష్ అపస్మారక స్థితిలో పడివున్న సీన్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
బచ్చలమల్లిగా నరేష్ బోల్డ్, రగ్గ్డ్ క్యారెక్టర్లో సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు తాను నటించిన ‘మజ్ను’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని, అద్భుతమైన ప్రతిభావంతుడని, ఈ కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించాడని ప్రశంసించారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘నానితో 16 ఏళ్లుగా అనుబంధం కొనసాగుతున్నది. నేను ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ధైర్యాన్నిచ్చాడు. దర్శకుడు సుబ్బు ఎంత అద్భుతంగా కథ చెప్పాడో అదే క్లారిటీతో సినిమా తీశాడు’ అన్నారు. ఈ సినిమాలో నరేష్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని దర్శకుడు సుబ్బు మంగాదేవి చెప్పారు. ఈ క్రిస్మస్కి బచ్చమల్లి మోత మోగిస్తాడని నిర్మాత రాజేష్ దండా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

