వైవిధ్యమైన కథాంశాలు, ప్రయోగాత్మక పాత్రలతో దక్షిణాదిన తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు మలయాళీ అగ్ర నటుడు మోహన్‌లాల్. మనమంతా, జనతా గ్యారేజ్ వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు మలయాళీ డబ్బింగ్ హిట్స్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు.
తాజా సమాచారం ప్రకారం మోహన్‌లాల్ మరోమారు తెలుగు స్ట్రెయిట్ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. దీనికి ‘కాకా’ అనే పేరు పరిశీలనలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఇందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపిస్తారట. ఇప్పటికే చిత్రబృందం మోహన్‌లాల్‌తో సంప్రదింపులు పూర్తి చేసిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.