ముంబై : ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొనగా ఆయన నగ్నచిత్రాల స్ఫూర్తితో పలువురు నటులు ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. తాజాగా టీవీ నటుడు కునాల్ వర్మ న్యూడ్ ఫోటోషూట్‌తో హాట్ టాపిక్‌గా మారాడు.
కునాల్ తన బోల్డ్ ఫోటోలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. రణ్‌వీర్‌సింగ్ స్ఫూర్తితోనే తాను నగ్న చిత్రాలను పోస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. కునాల్ వర్మ ఫోటో సెషన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాను రణ్వీర్ సింగ్ స్ఫూర్తితోనే ఇలా చేశానని, తనకు ఇందులో నగ్నత్వం కనిపించలేదని అన్నాడు.
ఇక తుజ్ సంగ్ ప్రీత్ లగాయి సజ్నాలో కనిపించిన కునాల్ ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. మరోవైపు తమ క్యాంపెయిన్ కోసం న్యూడ్‌గా ఫోజివ్వాలని పెటా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను ఆహ్వానించింది.