టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు పుష్ప. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుండటంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గాసిప్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ అనిష్ కురువిల్ల. పుష్ప చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వచ్చిన వార్తలపై అనిష్ స్పందించాడు. అల్లు అర్జున్-సుకుమార్ తో కలిసి పనిచేయడం ఇష్టమే అయినప్పటికీ.. ఈ వార్త నమ్మడానికి చాలా బాగుంది. పుష్పలో నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు. ఏదో ఒక రోజు అల్లు అర్జున్, సుకుమార్ తో కలిసి పనిచేస్తా. పుష్ప సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?