Ashish Vidyarthi | 60 ఏండ్ల వయసులో ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి .. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే !
Ashish Vidyarthi | ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి అరవై ఏండ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం కోల్‌కతాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.
Ashish Vidyarthi | ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి అరవై ఏండ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం కోల్‌కతాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని ఆశీష్ విద్యార్థి తెలిపారు. ఈ మేరకు పెండ్లి ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
సుమారు 20 ఏండ్ల క్రితం నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ఆశీష్ విద్యార్థి ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. పెండ్లయిన కొన్నేళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్‌లో రూపాలీకి పార్టనర్షిప్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీలో పుట్టి పెరిగిన ఆశీష్ విద్యార్థి 1991లో సినిమాల్లోకి వచ్చాడు. కాల్ సంధ్య అనే హిందీ చిత్రం ఆయన తొలి సినిమా. పాపే నా ప్రాణం సినిమాతో ఆశీష్ విద్యార్థి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన విలక్షణ నటనతో జాతీయ స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు ఆశీష్ విద్యార్థి. తెలుగులో గుడుంబా శంకర్, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ ఆశీష్ విద్యార్థి నటించాడు.
Read More :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

