One By Four | రాజమౌళి శిష్యుడు, ‘బాహుబలి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె. దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వన్ బై ఫోర్’ (One/4). వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 థియేటర్లలో విడుదల కానుంది. తేజస్ గుంజల్ ఫిలిమ్స్ మరియు రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. “ఇది ఒక విభిన్నమైన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. నిజ జీవితంలో మనం అనుకోకుండా మాట్లాడే ఒక మాట (టంగ్ స్లిప్) ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. రాజమౌళి గారి మేకింగ్ స్టైల్‌ను ఇన్పిరేషన్‌గా తీసుకుని, ఎక్కడా బోర్ కొట్టకుండా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో దర్శకుడు పళని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు” అని తెలిపారు. సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం, సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, మధుసూదన్ రావు వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జనవరి 30న భారీ స్థాయిలో 200 థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, మధుసూదన్ రావు, సునీత మనోహర్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: బాహుబలి పళని కె
నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్
సంగీతం: సుభాష్ ఆనంద్
డీవోపీ: గుణ శేఖర్
స్టంట్స్: కుంగ్ ఫు చంద్ర, జాషువా
డిజిటల్ మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)