‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అగ్ర హీరో నాని. ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా విడుదలైన ఈ సినిమాలోని తొలి పాట ‘ఆయా షేర్’ నేటికీ సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నదని మేకర్స్ తెలిపారు.
తాజాగా ఈ పాట కేవలం తెలుగు వెర్షన్లోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించి, నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా నిలిచిందని, సోషల్ మీడియానూ, పబ్లిక్ని ఈ పాట షేక్ చేస్తున్నదని మేకర్స్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాటలో శ్రీకాంత్ ఓదెల సృష్టించిన రఫ్ అండ్ రస్టిక్ ప్రపంచం, నాని పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయని, అనిరుధ్ ఎనర్జిటిక్ బీట్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం, జంగిరెడ్డి, అర్జున్ చాందీ గానం ఈ పాటకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని మేకర్స్ అంటున్నారు.