Aadi | అతిథి దేవోభవ ఫస్ట్‌లుక్ విడుదల

ఆదిసాయికుమార్, నివేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. రాజబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శివనిర్వాణ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సహజత్వ ప్రేమకథలకు ఆది చక్కగా సరిపోతాడు. అతడి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా ‘అతిథిదేవోభవ’ నిలవాలి. ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని తెలిపారు. ‘గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆది పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. తల్లీకొడుకుల అనుబంధానికి వినోదం, ప్రేమ, సెంటిమెంట్‌ను జోడించి రూపొందిస్తున్నాం. ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన అతిథి ఎవరన్నది ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు చెప్పారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రవీందర్‌రెడ్డి, భాస్కరబట్ల, శేఖర్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

