Pushpa The Rule Movie | పుష్ప-2 మూవీ క్రేజీ అప్డేట్..!
Pushpa-2 Movie | రెండేళ్ల క్రితం వచ్చిన 'పుష్ప' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజు నుంచి నిర్మాతల పాలిట కామధేనువులా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.
Pushpa-2 Movie | రెండేళ్ల క్రితం వచ్చిన ‘పుష్ప’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజు నుంచి నిర్మాతల పాలిట కామధేనువులా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాతో బన్నీకు తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక పుష్పలో బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్ షెకావత్. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ పాత్రలో నటించాడు. కనిపించింది కాసేపే అయినా తన నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక సెకండ్ పార్ట్‌లో ఫాహద్ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని చిత్రబృందం గతం నుంచే చెప్పుకొచ్చింది. ఇక ఫాహద్ కు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను మేకర్స్ కంప్లీట్ చేసినట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు షూటింగ్ లోకేషన్లో సుక్కు, ఫాహద్ మానిటర్ స్క్రీన్‌ను చూస్తున్న ఫోటోను పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక నటిస్తుంది. ఇక ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
A key schedule of #Pushpa2TheRule completed with ‘Bhanwar Singh Shekhawat’ aka #FahadhFaasil 💥💥
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie @TSeries pic.twitter.com/l4lixpvhm7
— Mythri Movie Makers (@MythriOfficial) May 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

