లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ‘800’ పేరుతో వెండితెర దృశ్యమానమవుతున్నది. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమా ఆలిండియా థియేట్రికల్ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మురళీధరన్ క్రికెట్లో శిఖరాగ్రానికి చేరుకున్న వైనాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అన్నారు.