Javed Akhtar: ఆ ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు: జావెద్ అక్తర్
Javed Akhtar:జావెద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన లాహోర్‌లో జరిగిన ఓ సభలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై కవి, రచయిత జావెద్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశారు. లాహోర్‌లో జరిగిన ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. ఆ దేశ వైఖరిని తప్పుపట్టారు. ముంబైపై ఉగ్రదాడి జరిగిందని, సెప్టెంబర్ 26 దాడులకు చెందిన ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, భారత్‌పై ద్వేషాన్ని వెదజల్లడం సరికాదు అని జావెద్ అక్తర్ తెలిపారు. ఉర్దూ భాష కవి ఫయిజ్ అహ్మాద్ ఫయిజ్ జ్ఞాపకార్ద వేడుకల్లో జావెద్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब… 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf
— Mohammed Shoaib (@ShoaibIND) February 21, 2023
రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం తగ్గాలని ఆయన సూచన చేశారు. దీనికి ఇండియాను నిందించడం సరికాదన్నారు. పాక్‌లో మంచి వాళ్లు ఉన్నారని, వాళ్లు బాంబులు వేయడం లేదని, పూలమాలలు వేస్తున్నారని, దీనికి మీరేమంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఒకరిపై ఒకరు నిందలు చేసుకోవడం సరికాదన్నారు. దాని వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చాలని, తాను ముంబైకి చెందినవాడినని, సిటీపై దాడి జరగడం చూశానని, వాళ్లేమీ నార్వేనో లేక ఈజిప్టు నుంచి రాలేదని, కానీ వాళ్లు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అందుకే భారతీయుల గుండెల్లో కోపం ఉందని, దానిపై ఫిర్యాదులు అవసరం లేదని జావెద్ అన్నారు.
ఇండియన్ ఆర్టిస్టులకు పాక్‌లో గౌరవం దక్కలేదని, కానీ ఇండియాలో మాత్రం పాక్ కళాకారులు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఫయాజ్ సాహెబ్ వచ్చినప్పుడు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, అంతటా బ్రాడ్కాస్ట్ చేశామని, నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహిదీ అసన్ వచ్చినప్పుడు ఫంక్షన్ చేశామని, కానీ మీరెప్పుడు లతా మంగేష్కర్‌కు గౌరవ సభ ఏర్పాటు చేయలేదని జావెద్ అన్నారు. అక్తర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

