24 Frames Factory | ‘కన్నప్ప’ సినిమాను పొగడాలి అంటూ యూట్యూబర్స్కు మెయిల్.. ఫేక్ అంటూ స్పందించిన నిర్మాణ సంస్థ
Kannppa Movie Fake Emails | ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై యూట్యూబ్‌లలో ట్రోల్ వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ట్రోల్ చేస్తున్న వారి యూట్యూబ్ అకౌంట్స్‌ను బ్లాక్ చేయిస్తున్నాడు మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు.
Kannppa Movie Fake Emails | ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై యూట్యూబ్‌లలో ట్రోల్ వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ట్రోల్ చేస్తున్న వారి యూట్యూబ్ అకౌంట్స్‌ను బ్లాక్ చేయిస్తున్నాడు మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు. అయితే ఇలా చేయడం నచ్చని కొందరు ఆకతాయిలు మంచు విష్ణు పేరిట, కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో పలు యూట్యూబర్లకు ఈమెయిల్‌లు పంపారు. ఈ ఈమెయిల్లో యూట్యూబర్లపై చర్యలు తీసుకోవద్దంటే విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాను పోగుడుతూ వీడియోలు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ విషయంపై పలువురు యూట్యూబర్లు మండిపడుతూ.. విష్ణుపై, కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ వార్తలపై తాజాగా 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ క్లారీటి ఇస్తూ అవి ఫేక్ ఈ మెయిల్స్ నమ్మకండి అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మా ప్రొడక్షన్ కంపెనీకి అస్సలు సంబంధం లేని తప్పుడు ఇమెయిల్ వినియోగదారు పేరుతో “Twenty FourFFOfficial” వినియోగించబడిన సంఘటన గురించి మాకు తెలిసింది. info@24FramesFactory.com. మా కంపెనీ నుండి ఈ అధికారిక ఇమెయిల్ చిరునామా నుండి కాకుండా వచ్చే అన్ని కమ్యూనికేషన్లను తప్పుడు మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుండి రావడం లేదని భావించాలి. మా పరస్పర చర్యలసమగ్రతను నిలుపుకోవడానికి మేము చర్యలు తీసుకున్నాము.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అలాగే కన్నప్ప యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పేర్కొన్నట్లుగా… “మా కంపెనీ నుండి వచ్చినట్లు ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం మరియు ఇమెయిళ్ళను మేము గమనించాము. info@24Frames Factory.com నుండి పంపబడని ఈమెయిళ్లను నిర్లక్ష్యం చేయండి. ఈ తప్పుడు ఇమెయిళ్ల మూలాన్ని గుర్తించడం కోసం మేము క్రియాశీలకంగా దర్యాప్తు చేస్తున్నాము, మరియు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాము.”
మా నటుడు విష్ణు మంచు నటుల గౌరవం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పోరాటం చేస్తున్నందున, కొంతమంది తప్పుడు వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన యత్నాలను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా స్పష్టమవుతుంది. ఇలాంటి తప్పుడు పన్నాగాలకు బలి కాకుండా ఉండమని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. నిజమైన సినిమా ప్రేమికులు ఎల్లప్పుడూ సినిమాను ప్రేమిస్తారు. ఈ విషయం పరిష్కరించుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు మీ మద్దతు కోరుకుంటున్నాము. అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Official Statement from 24 Frames Factory pic.twitter.com/cO0AQIJsVP
— 24 Frames Factory (@24FramesFactory) July 26, 2024
Also read..
Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ ఆరంభ సంబరాల్లో.. ముఖేశ్ – నీతా అంబానీ దంపతులు
Venkaiah Chowdhury | వేంకటేశ్వరుని ఆశీస్సులతో అదనపు ఈవోగా బాధ్యతలు : వెంకయ్యచౌదరి
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

