“18పేజీస్’ సినిమా బాగా వచ్చింది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూశాక మీరు తప్పకుండా ప్రేమలో పడతారు’ అని అన్నారు నిఖిల్. ఆయన హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘18పేజీస్’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత.
ఈ నెల 23న విడుదలకానుంది. శనివారం ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ పేర్కొన్నారు. నేటి యువత ట్రెండ్‌కు తగినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అరవింద్‌గారు ఈ సినిమా విషయంలో ఎంతో ప్రోత్సాహాన్నందించారు. హృదయానికి హత్తుకునే ప్రేమకథగా మెప్పిస్తుంది’ అన్నారు.