105 నిమిషాల్లో.. 105 మినిట్స్

కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తోన్న కథానాయిక హన్సిక గత కొంతకాలంగా అభినయ ప్రధానమైన పాత్రల వైపు దృష్టిపెడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘105 మినిట్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా సింగిల్‌షాట్‌లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఒక ఇంట్లో జరిగే సంఘటనలతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. హన్సిక ఏక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నిడివి కూడా 105 నిమిషాలే కావడం విశేషం. ప్రయోగాత్మక చిత్రంలో నటించడం పట్ల హన్సిక ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేసింది. ‘వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉంది. రియల్‌టైమ్‌లో ఒకే షాట్లో తీసే ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు చక్కటి అనుభూతినందిస్తుంది. నా కెరీర్లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది’ అని హన్సిక పేర్కొంది. ఈ చిత్రానికి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హన్సిక నటించిన ‘మహ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

