సింగిల్‌షాట్ సినిమా
‘నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘105 మినిట్స్’ చాలా ప్రత్యేకమైనది. ఒకే ఒక పాత్రతో, సింగిల్‌షాట్‌లో సినిమా చేయడం సరికొత్త ప్రయోగంగా భావిస్తున్నా’ అని చెప్పింది హన్సిక. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకుడు. బొమ్మక్ శివ నిర్మాత. త్వరలో విడుదలకానుంది. ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హన్సిక మాట్లాడుతూ ‘పూర్తి ప్రయోగాత్మక చిత్రమిది. ఇరవై నిమిషాల రెయిన్షాట్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినూత్న కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని తెలిపింది. ‘భారతీయ స్క్రీన్‌పై తొలిసారి ఒకే ఒక పాత్రతో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా సింగిల్‌షాట్‌లో తీసిన చిత్రమిది. హన్సిక పాత్ర పూర్తిగా కొత్త పంథాలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అని దర్శకుడు చెప్పారు. ఆరురోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశామని నిర్మాత బొమ్మక్ శివ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్, సంగీతం: సామ్ సి యస్, దర్శకత్వం: రాజు దుస్సా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


