సాధారణంగా హీరోల పారితోషికాలు, వారికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాల గురించే అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ విషయంలో హీరోయిన్ల గురించి అంతగా పట్టించుకోరు. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార అస్సెట్స్ గురించిన ఓ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దక్షిణాదిలో రిచెస్ట్ హీరోయిన్ నయనతారేనట. ప్రస్తుతం ఈ భామ ఒక్కో సినిమాకు పదికోట్లకు పైగానే పారితోషికాన్ని తీసుకుంటున్నదని, సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినీ నిర్మాణంలో కూడా ఉందని, ఇప్పటికే ఆమె 300కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల్ని సమకూర్చుకుందని ప్రచారం జరుగుతున్నది.
చెన్నై, ముంబయి, హైదరాబాద్‌లో నయనతార భారీ పెట్టుబడులు పెట్టిందని చెబుతున్నారు. ఆమెకు 50కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ కూడా ఉందని తెలిసింది. చెన్నై ట్రేడ్ వర్గాలు కూడా ఈ వార్తలు నిజమే అంటున్నాయి. లేడీ సూపర్‌స్టార్ అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే నయనతార ఇప్పటికీ సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నది. ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువవుతున్నది.