‘రావణాసుర’ ఆశ్చర్యపరుస్తుంది
స్వామి రారా’, ‘కేశవ’, ‘రణరంగం’ వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుధీర్ వర్మ. రవితేజ హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మా‘రావణాసుర’ ఆశ్చర్యపరుస్తుందిన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా నటించారు. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
‘స్వామి రారా’, ‘కేశవ’, ‘రణరంగం’ వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుధీర్ వర్మ. రవితేజ హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మా‘రావణాసుర’ ఆశ్చర్యపరుస్తుందిన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా నటించారు. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు సుధీర్ వర్మ.
‘రావణాసుర’ ఎలా ఉండబోతున్నది?
ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఇచ్చే సినిమా ఇది. ఇందులో షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు రవితేజ నా దగ్గరకు అతన్ని పంపించారు. నేనైతే ఈ కథను సరైన విధంగా తెరకెక్కించగలను అని ఆయన నమ్మారు. తెలుగు తెరకు ఇదొక కొత్త తరహా మూవీ అవుతుంది. ఒక పెద్ద హీరో థ్రిల్లర్‌లో నటించడం అరుదు. సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాం.
‘రావణాసుర’ ఆశ్చర్యపరుస్తుంది
ఆయనతో దర్శకులు ఎంటర్టైనింగ్ మూవీస్ చేస్తున్నారు. థ్రిల్లర్ కథతో సినిమా రూపొందించడం కొత్తగా ఉంటుందని అనిపించింది. ఈ పాత్ర ఎలా ఉండాలని మేము కోరుకున్నామో రవితేజ అలాగే నటించారు. పాత్రను అర్థం చేసుకుని పర్మార్మ్ చేశారు. ఇది పూర్తిగా రవితేజ సినిమా.
ఐదుగురు నాయికలతో పాటు పేరున్న నటీనటులు ఉన్నారు. వీరికి కథలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
ప్రతి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పగలను. ఇంతమంది ఆర్టిస్టులు సినిమాలో ఏం చేస్తారు అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలగాలి. సినిమా చూస్తే వీరి క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది. షాక్, థ్రిల్, సర్ప్రైజ్ అనే అంశాలు ప్రధానంగా ఆకట్టుకుంటాయి.
ఇతర భాషల్లోకి చిత్రాన్ని ఎందుకు విడుదల చేయడం లేదు?
ముందుగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. అయితే వాళ్లకు 15 రోజుల ముందుగానే మూవీ కాపీని పంపించాలి. అక్కడ మా సినిమా కీలక అంశాలు బయటకొచ్చే ప్రమాదం ఉంది. థ్రిల్లర్ సినిమాలకు ఇది మంచిది కాదు అనిపించింది. అది తెలుగులో ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఇతర భాషల ఆలోచన విరమించుకున్నాం.
పవన్ కళ్యాణ్‌తో మీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
ప్రస్తుతం నిఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నా. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారితో సినిమా సంప్రదింపులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ కథతో ఆ సినిమా ఉంటుంది. అది ఎప్పుడు అనేది త్వరలో వెల్లడిస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

