మహాలక్ష్మిని ఇంటికి తెద్దామని
అతి తక్కువ కాలంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రాలు అతనికి విజయాలను అందించాయి. కిరణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘సమ్మతమే’. చాందినీ చౌదరి నాయికగా నటిస్తున్నది. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కిరణ్ అబ్బవరం.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి నేనూ మంచి మిత్రులం. లఘు చిత్రాలు చేస్తున్నప్పటి నుంచి కలిసే సినిమా పరిశ్రమలోకి రావడం గురించి ఆలోచించేవాళ్లం. ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాం. నేను హీరోగా రెండు చిత్రాలు చేసేప్పటికి గోపీ ఈ కథ రెడీ చేసుకున్నాడు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ సినిమాలో చాలా సులువైన అంశానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం సరదాగా సాగుతుంది. కొత్తదనంతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమా పైకి సాఫ్ట్‌గా కనిపిస్తున్నా, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఈ ఏడాది మూడు సినిమాలు
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా ముందే కుదిరిన చిత్రమిది. అప్పటికి తక్కువ బడ్జెట్లో చేద్దామనుకున్నాం. కానీ రాను రాను సినిమా మేకింగ్ స్థాయి పెరుగుతూ వచ్చింది. చాలా మంది పేరున్న ఆర్టిస్టులను ప్రధాన పాత్రలకు తీసుకున్నాం. 75 లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా షూటింగ్ చేశాం. నా ప్రతి సినిమాకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. అనుకున్నట్లు సన్నివేశాలు రాకుంటే నిర్మాతను రిక్వెస్ట్ చేసి మళ్లీ చేసుకుంటాం. నా వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ‘సెబాస్టియన్ పీసీ 524’ సినిమాకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోలేకపోయాను. ప్రస్తుతం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాల్లో నటిస్తున్నా. జూలై కల్లా ఇవన్నీ షూటింగ్ పూర్తవుతాయి. ఇదే ఏడాది విడుదలకు వస్తాయి.
ఆడపిల్లే ఇంటికి మహాలక్ష్మి
ఏ ఇంటికైనా మహాలక్ష్మి ఆడపిల్లే అని ట్రైలర్లో చూపించాం. అలాంటి మహాలక్ష్మిని తన పెళ్లి ద్వారా ఇంటికి తీసుకురావాలని కోరుకునే కుర్రాడి కథ ఇది. ఈ చిత్రంలో మధ్య తరగతి యువకుడి పాత్రలో కనిపిస్తాను. తనకు కాబోయే భార్య ఇంటికి వెలుగులా మారాలని కోరుకుంటూ పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని ప్రయత్నం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్య కుర్రాడు సిటీ అమ్మాయితో ప్రేమలో పడ్డాక వచ్చే సరదా సన్నివేశాలు నవ్విస్తాయి. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. అవి కథను ముందుకు నడిపిస్తూ సాగుతాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

