YouTube : యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంపై యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు న్యూ ఫీచర్లను జోడిస్తోంది. ఇక వీడియోలో ముఖ్యాంశాన్ని వీక్షించేందుకు చివరి వరకూ చూసే ఓపిక లేని వ్యూయర్స్ కోసం ఓ అద్భుతమైన ఫీచర్‌ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురానుంది. జంప్ అహేడ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా ఇది మిమ్మల్ని వీడియోలోని కీలక భాగంలోకి నేరుగా తీసుకువెళుతుంది.
ఈ న్యూ ఏఐ ఆధారిత టూల్ ద్వారా పరమిత సమయంలో వీడియోలను వేగంగా వీక్షించాలనుకునే వ్యూయర్స్ కోసం ఈ లేటెస్ట్ ఫీచర్‌ను యూట్యూబ్ డెవలప్ చేస్తోంది. యూజర్ వీక్షణ అభిరుచులను మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో విశ్లేషించిన మీదట ఈ ఫీచర్ సదరు వీడియోల్లోని ముఖ్యమైన భాగంలోకి యూజర్‌ను నేరుగా తీసుకువెళుతుంది.
యూజర్ సంబంధిత వీడియోపై డబుల్ క్లిక్ చేయగానే జంప్ అహేడ్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా వీడియోలోని హైలైట్ పార్ట్ ప్లే అవుతుంది. ఇది యూజర్ సమయాన్ని ఆదా చేయడంతో పాటు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. సుదీర్ఘ వీడియోలు, డాక్యుమెంటరీల్లో కీలక సమాచారం వీక్షించాలనుకునేవారికి ఈ ఫీచర్ వెసులుబాటు కలిగిస్తుంది.
Read More :