Yahoo Layoff | లేఆఫ్ ప్రకటించనున్న యాహూ.. 20శాతం మందిపై వేటు..!
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
Yahoo Layoff | ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇంటెల్, ఓఎల్ఎక్స్ తదితర టాప్ కంపెనీలు ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు కంపెనీలు వెల్లడించాయి. కాగా, ఈ జాబితాలోకి తాజాగా మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది.
యాహూ (Yahoo) తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ తొలగింపు వల్ల యాహూ యాడ్ టెక్ ఉద్యోగుల్లో 50 శాతం మంది.. అంటే దాదాపుగా 1600 కంటే ఎక్కువ మందిపై ఈ ప్రభావం పడనుందని నివేదిక పేర్కొంది. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు టెక్ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

