Xiaomi 14 Civi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ప్రీమియం సెగ్మెంట్.. షియోమీ 14 సివి ఫోన్ ను ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ సివి 4 ప్రో ఫోన్ ను రీబ్రాండ్ చేసి షియోమీ 14 సివి ఫోన్ ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది. షియోమీ సివి14 ప్రో ఫోన్ ను గత మార్చిలో చైనా మార్కెట్ లో ఆవిష్కరించారు. షియోమీ 14 సివి ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.43 వేలు ఉండొచ్చునని భావిస్తున్నారు. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరిస్తారని చెబుతున్నా, కంపెనీ నుంచి క్లారిటీ లేదు.
షియోమీ 14 సివి ఫోన్ 1.5 కే అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందని, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెట్ ప్రాసెసర్ తో వస్తుందని తెలుస్తున్నది. లైకా బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం డ్యుయల్ 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయని చెబుతున్నారు. 67వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. క్రూయిజ్ బ్లూ, మచ్చా గ్రీన్, షాడో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుందని తెలుస్తున్నది.