H1- B Visa | అమెరికాలో మనోళ్లు సేఫ్.. కొలువు పోయినా అక్కడే ఉండొచ్చు.. కానీ !
H1- B Visa | టెక్ దిగ్గజాల భారీ ఉద్వాసనల్లో కొలువు పోయిన హెచ్1 బీ వీసాదారులు 60 రోజుల్లో స్వదేశానికి వెళ్లనక్కర్లేదని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ యూాాాఆర్ ఎం జాడూ తెలిపారు. వారు తమ ఇమ్మిగ్రెంట్ అప్లికేషన్లో అడ్జస్ట్మెంట్ స్టేటస్ అని సవరించాలని చూచించారు.
H1- B Visa | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయట పడేందుకు టెక్నాలజీ నుంచి ఆర్థిక సేవల సంస్థల వరకు దాదాపు దిగ్గజ కార్పొరేట్లు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా టెక్నాలజీ సంస్థలు వేల మందిని ఇండ్లకు పంపేశాయి. వారిలో హెచ్1-బీ వీసా కింద ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులు.. ఉద్యోగాలు కోల్పోయిన 60 రోజుల్లో మరో కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలన నిబంధన ఉంది. కానీ, అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విదేశీయులకు.. అందునా హెచ్1-బీ వీసా కింద పని చేస్తున్న నాన్ ఇమ్మిగ్రేంట్ వర్కర్లకు కాసింత రిలీఫ్‌నిచ్చే ప్రకటన చేసింది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించుకోలేని విదేశీ నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లు వారి స్వదేశానికి తరలి వెళ్లాలన్న నిబంధనపై తప్పుడు నిర్ధారణలు చేస్తున్నారని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ యూఆర్ ఎం జడ్డూ తేల్చేశారు.
ఉద్యోగాలు కోల్పోయినా అమెరికాలోనే వారు కొనసాగడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని కుండబద్ధలు కొట్టారు. అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ‘హెచ్1-బీ వీసా’ కింద పని చేస్తున్న విదేశీ నిపుణులు-వర్కర్లలో అత్యధికులు భారతీయ నిపుణులే. అంటే అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో సొంత దేశానికి వెళ్లిపోవాలన్న నిబంధనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుస్తున్నది.
టెక్ దిగ్గజ సంస్థల భారీ ఉద్వాసనల నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన నాన్ ఇమ్మిగ్రేంట్ నిపుణులు మరో కొలువు పొందేందుకు, అమెరికాలో ఉండేందుకు గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి పెంచాలని కోరుతూ యూఎస్‌సీఐఎస్‌కి ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) లేఖ రాసింది. దీనిపై యూఆర్ ఎం జడూ రియాక్టయ్యారు. నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు గల ఆప్షన్ల పట్ల అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఐడీఎస్ డైరెక్టర్ ఫర్ పాలసీ అండ్ అనాలసిస్ స్ట్రాటర్జీ ఖండేరావు కండ్కు లేఖ రాశారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నాన్-ఇమ్మిగ్రెంట్ కార్మికులు, వారి కుటుంబాలపై పడే సామాజిక, ఆర్థిక ప్రభావంపై తమకు అవగాహన ఉందని యూఆర్ ఎం జడూ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా గానీ, అసంకల్పితంగా గానీ ఉద్వాసనకు గురైన నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లు తమ వీసా గడువు ముగిసే వరకు అమెరికాలోనే జీవించవచ్చునని తెలిపారు. అయితే నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌ను మార్చి, అప్లికేషన్ ఫర్ అడ్జస్ట్మెంట్ స్టేటస్ దాఖలు చేయాలన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

