Hyper Car Batista | ఫాస్టెస్ట్ ఈవీ కారు బటిష్ట.. 1.86 సెకన్లలో 100 కిమీ గరిష్ట వేగం.. బట్ లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ!
Batista | ప్రపంచంలోనే శరవేగంగా దూసుకెళ్లే బటిస్ట ఈవీ కారును మహీంద్రా ఆవిష్కరిస్తుంది. 1.82 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకోవడం దీని స్పెషాలిటీ.
Hyper Car Batista | దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రపంచంలోకెల్లా శరవేగంగా దూసుకెళ్లగల ఎలక్ట్రిక్ కారు `ప్యూర్ ఎలక్ట్రిక్ హైపర్ జీటీ `బట్టిస్టా`ను మార్కెట్లోకి తెచ్చింది. రియల్ వరల్డ్ కండీషన్స్‌లో కేవలం 1.86 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. 4.75 సెకన్లలో గంటకు 200 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. స్టెబిలిటీ అండ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఆధారంగా కారు పని చేస్తుంది. 100 కి.మీ. స్పీడ్‌తో దూసుకెళ్తున్నా 31 మీటర్ల దూరంలో నిలిపేయవచ్చు. ఇటలీ లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్ ఆటోమొబిలిటీ పినిన్ ఫారినాను సొంతం చేసుకున్నది మహీంద్రా అండ్ మహీంద్రా.
బట్టిస్టా కారు నాలుగు వీల్స్‌కు వేర్వేరుగా సెపరేట్‌గా మోటర్లు పని చేస్తాయి. ఈ మోటర్లతో మొత్తం 140 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ఈ మోటార్స్ 1900 బీహెచ్పీ పవర్, 2300 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. గరిష్టంగా గంటకు 350 కి.మీ వరకు దూసుకెళ్లగలుగుతుంది. ఐదు విభిన్న డ్రైవ్ మోడ్లతో బట్టిస్ట ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.
హైపర్ జీటీ `బట్టిస్టా` 120 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నది. ఇది సింగిల్ చార్జింగ్తోనే 476 కి.మీ దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ. దీని బాడీ మొత్తం కార్బన్ ఫైబర్‌తోనే తయారు చేశారు. ఒక కారు అసెంబ్లింగ్‌కు 1250 గంటల టైం పడుతున్నది. కేవలం 150 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.19.45 కోట్లు పలుకుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

