PPF&Sukanya | ఈసారైనా పీపీఎఫ్.. సుకన్య వడ్డీరేట్లు కేంద్రం సవరిస్తుందా?!
PPF&Sukanya | గత త్రైమాసికానికి చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు పెంచిన కేంద్రం.. ఈసారైనా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పథకాలపై వడ్డీరేట్లు సవరిస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
PPF&Sukanya | మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేందుకు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై కేంద్రం మరోమారు వడ్డీరేట్లు సవరించనున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఈ నెలాఖరులోగా కొత్త వడ్డీరేట్లు ప్రకటించనున్నది. ఇంతకుముందు జనవరి-మార్చి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు సవరించిన కేంద్రం.. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాల ఊసెత్తలేదు. ఈ దఫా ఆ రెండు పథకాల వడ్డీరేట్లు పెంచనున్నదని సమాచారం. కేంద్రం రూపొందించిన ఫార్ములా ప్రకారం అన్ని పథకాలకు వడ్డీరేట్లు సవరించాలి. కానీ, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వడ్డీరేట్లు సవరించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీరేట్లు సవరిస్తుంది. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డీరేట్లు సవరిస్తూ ఉంటుంది. చివరి మూడు నెలల్లో ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడుల ఆధారంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులపై వడ్డీరేట్లను సవరిస్తుంది.
2011లో శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 2016లో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల సవరణకు ఓ పార్ములాను నోటిఫై చేసింది కేంద్ర ఆర్థికశాఖ. ఈ ఫార్ములా ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే ఆదాయంలో 25 బేసిక్ పాయింట్లు పీపీఎఫ్‌కు వడ్డీ పే చేయాలి. సుకన్య సమృద్ధి యోజనకైతే 75 బేసిక్ పాయింట్లు కలపాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ స్కీమ్స్‌కు గరిష్టంగా 100 బేసిక పాయింట్ల వడ్డీ పెంచాలి. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య పదేండ్ల బెంచ్‌మార్క్ బాండ్లపై 7.37 శాతం ఆదాయం వస్తున్నది.
ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ అందిస్తున్నది. 2016లో కేంద్రం రూపొందించిన ఫార్ములా ప్రకారం పీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం కావాలి. సుకన్య సమృద్ధి యోజనపై ప్రస్తుతం అమల్లో ఉన్న 7.6 శాతం వడ్డీరేటు 8.1 శాతానికి చేరాల్సి ఉంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వడ్డీరేట్లు సవరించలేదు. ఈ సారైనా ఈ రెండు పథకాల వడ్డీరేట్లు సవరిస్తారా.. లేదా.. అంటే వెయిట్ చేయాల్సిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

