Wikipedia | మస్క్‌పై వికీపీడియా ఫౌండర్ ఫైర్ : ఎక్స్ సమాచారాన్ని విశ్వసించలేమన్న జిమ్మీ వేల్స్
మనకు ఏదైనా కీలక సమాచారం అవసరమైతే వెంటనే వికీపీడియాను (Wikipedia) సందర్శిస్తాం. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, వర్కింగ్ ప్రొషెషనల్స్ అధికంగా ఉపయోగించే ఈ వెబ్‌సైట్‌కు జిమ్మీ వేల్స్ సహ వ్యవస్ధాపకుడు.
న్యూయార్క్ : మనకు ఏదైనా కీలక సమాచారం అవసరమైతే వెంటనే వికీపీడియాను (Wikipedia) సందర్శిస్తాం. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, వర్కింగ్ ప్రొషెషనల్స్ అధికంగా ఉపయోగించే ఈ వెబ్‌సైట్‌కు జిమ్మీ వేల్స్ సహ వ్యవస్ధాపకుడు. వికీపీడియాను చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) సైతం చదువుతున్నాయి. ఈ ఎల్ఎల్ఎంలు వికీపీడియాను చదవగలుగుతున్నాయి కానీ ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్‌ను కాదని జిమ్మీ వేల్స్ వ్యాఖ్యానించారు.
సరైన సమాచారానికి ఎక్స్ విశ్వసనీయ వేదిక కాదని మస్క్‌ను, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ఉద్దేశించి వికీపీడియా కో ఫౌండర్ వేల్స్ దుయ్యబట్టారు. ట్విట్టర్‌కు (ఎక్స్) బదులు ఎల్ఎల్ఎంలు తన వెబ్‌సైట్‌ను చదవడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని వేల్స్ పేర్కొన్నట్టు ఫార్చూన్ రిపోర్ట్ వెల్లడించింది. వికీపీడియా డేటాపై ఎల్ఎల్ఎం శిక్షణకు సంబంధించి లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో వేల్స్‌ను ప్రశ్నించగా ఈ వ్యాఖ్యలు చేశాడని ఫార్చూన్ రిపోర్ట్ పేర్కొంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఆయన వ్యాఖ్యలకు చప్పట్లతో తమ మద్దతును తెలియచేశారు. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మస్క్ ఆఫర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్పటివరకూ వినలేదని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎలన్ మస్క్ ఇటీవల వికీపీడియా దాని కో ఫౌండర్‌పై చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగింది. వికీపీడియా తన వెబ్సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాలని మస్క్ సూచించారు. తన సూచనకు అనుగుణంగా వారు పేరు మార్చితే తాను ఆ వెబ్‌సైట్‌కు మిలియన్ డాలర్లు ఇస్తానని మస్క్ వ్యాఖ్యానించారు.
Read More :
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

