Credit Cards | కొత్తగా క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..!
Credit Cards | కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వారు తక్కువ లేదా జీరో ఫీజు వసూలు చేసే కార్డులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు అంటున్నారు.
Credit Cards | గతంలో ఉన్నత వర్గాల ప్రజలకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు మాత్రమే బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేసేవి. కానీ ఇటీవల రూ.25 వేల పై చిలుకు వేతనం గల వేతన జీవులకు, మోస్తరు ఆదాయం గల వారికి క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి బ్యాంకులు, క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు నువ్వా.. నేనా.. అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పుడే ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు ఇప్పటి వరకూ క్రెడిట్ కార్డు తీసుకోని తమ అకౌంట్ హోల్డర్లకు ఈ క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, కొత్త క్రెడిట్ కార్డులు తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డుల జారీపై ఇలా ఫీజు వసూళ్లు
మామూలుగా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు తమ ఖాతాదారులకు కొత్త క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నప్పుడు కొంత ఫీజు వసూలు చేస్తాయి. ఏడాది ఫీజు, కార్డు స్టేట్మెంట్ ఫీజు తదితర అంశాలు ఇందులో జత కలుస్తాయి. తీసుకున్న క్రెడిట్ కార్డు కోల్పోతే.. దాన్ని బ్లాక్ చేసి, కొత్త క్రెడిట్ కార్డు జారీ చేయడానికి సంబంధిత క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఫీజు వసూలు చేస్తాయి. ఇటువంటి ఫీజులన్నీ క్రెడిట్ కార్డు ఖాతాదారులపై తడిసిమోపడవుతున్నాయి.
ఇలా తక్కువ ఫీజు క్రెడిట్ కార్డులపై ప్రాధాన్యం
క్రెడిట్ కార్డును కొత్తగా తీసుకునే వారు ఫీజు లేని.. తక్కువ ఫీజు వసూలు చేసే కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాన్ని ప్రతి నెలా వాడుతున్నట్లయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తే ఖాతాదారులపై బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వడ్డీ వసూలు చేయవు. మామూలుగానైతే క్రెడిట్ కార్డులపై 50 రోజుల వరకు వడ్డీ ఫ్రీ.. దీన్ని కూడా సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థలు బ్యాంకులు.. మీ కార్డు బిల్లు సైకిల్ ఆధారంగా నిర్ణయిస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా చెల్లించేయాలి. అలా కాకుండా లేట్ చేస్తే ఫీజుతోపాటు వడ్డీని వడ్డిస్తాయి బ్యాంకులు.
క్రెడిట్ కార్డుపై గరిష్ట వాడకం పరిమితి ఇలా
ఇక ప్రతి ఒక్కరూ వాడే క్రెడిట్ కార్డు వినియోగానికి గరిష్ఠ పరిమితి ఖరారు చేస్తాయి క్రెడిట్ కార్డు తయారీ సంస్థలు.. బ్యాంకులు. ఒక నెల క్రెడిట్ స్టేట్మెంట్ పరిధిలోనే దాన్ని వినియోగించుకోవాలి. సంబంధిత క్రెడిట్ కార్డు హోల్డర్ సిబిల్ స్కోర్, పేమెంట్స్ హిస్టరీ, ఇన్‌కం, వాడకం నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని ఆ కార్డు వాడకంపై గరిష్ట పరిమితిని ఖరారు చేస్తాయి. ఫస్ట్‌టైం క్రెడిట్ కార్డు తీసుకుని వాడుతున్న వారికి తక్కువ వాడకం లిమిట్ ఉండొచ్చు. నిరంతరం టైం లోపల క్రెడిట్ బిల్లులు చెల్లిస్తుంటే, సంబంధిత క్రెడిట్ తయారీ సంస్థలు వారి క్రెడిట్ గరిష్ట పరిమితి పెంచేయడానికి చాన్స్ ఉంటుంది.
కనీస మొత్తం పేమెంట్‌తో వడ్డిం`పు
అత్యధికులు మొత్తం క్రెడిట్ బిల్లు పే చేయకుండా మినిమం బిల్లు చెల్లిస్తుంటారు. కనీస బిల్లు మొత్తం బిల్లులో ఐదు శాతమే.. ఈ కనీస మొత్తం బిల్లు పేమెంట్ చేయడం వల్ల క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు కానీ.. మిగతా మొత్తానికి అదనపు వడ్డిస్తాయి. కనుక టైం లోపు మొత్తం క్రెడిట్ బిల్లు పే చేయడమే శ్రేయస్కరం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి భారీ మొత్తంలో క్రెడిట్ కార్డు కొనుగోళ్లు జరిపితే.. ఆ బిల్లును నెలవారీ వాయిదాలుగా మార్చుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
ఇలా స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి
ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవాలి. మీరు కొనుగోలు చేసిన వస్తువుల విలువ, కొన్న బిల్లు స్టేట్మెంట్, వడ్డీ ఇతర ఫీజు తదితర విషయాలేమైనా ఉన్నాయా పరిశీలించుకోవాలి. క్రెడిట్ కార్డు లావాదేవీల్లో తేడాలు ఉంటే వెంటనే క్రెడిట్ కార్డు జారీ సంస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి.
క్రెడిట్ కార్డు బిల్లింగ్‌లో ఇలా వెసులుబాట్లు
ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ బిల్లింగ్ తేదీలు చెక్‌చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ తేదీ 15 అనుకుందాం.. 16వ తేదీ నుంచి కొత్త స్టేట్మెంట్ బిల్లు మొదలవుతుందన్న మాట. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ బిల్లింగ్ మొదట్లో కొనుగోలు చేస్తేనే 50 రోజుల టైం లభిస్తుంది. అలా రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ గడువు తగ్గుతుంది. క్రెడిట్ కార్డు వాడకంపై వచ్చే రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను చెక్ చేసుకోవాలి. కొన్ని వస్తువుల కొనుగోలుపై రివార్డు పాయింట్ల ద్వారా రాయితీ లభిస్తుంది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. రాయితీలు ఇలా
హొటల్ బుక్ చేసుకున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు వాడితే డిస్కౌంట్లు పొందొచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే.. ఆ బెనిఫిట్ వెంటనే లభిస్తుంది. క్రెడిట్‌కార్డుతో కొనుగోళ్లు చేసేవారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డులతో ఆయా బ్యాంకుల ఏటీఎంల్లో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఇలా ఏటీఎంల నుంచి క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేసుకుంటే 3.5 శాతం వరకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయన్న సంగతి విస్మరించొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

