వైట్-కాలర్ జాబ్స్ డౌన్
దేశవ్యాప్తంగా వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి నెలలో ఈ నియామకాలు 11 శాతం తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
- జనవరిలో 11 శాతం తగ్గిన రిక్రూట్మెంట్లు
ముంబై, ఫిబ్రవరి 6: దేశవ్యాప్తంగా వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి నెలలో ఈ నియామకాలు 11 శాతం తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన జనవరి నెలలో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు 19 శాతం తగ్గినట్లు, అయినప్పటికీ హెల్త్‌కేర్, ఆతిథ్య, ఎఫ్ఎంసీజీ రంగాల్లో మాత్రం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడించింది. నెలవారి జాబితాలో భాగంగా గత నెలకుగాను విడుదల చేసిన నివేదికలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి మెషిన్ లెర్నింగ్ ఇంజినీరింగ్, ఏఐ సైంటిస్ట్ ఉద్యోగ నియామకాలు 46 శాతం, 23 శాతం చొప్పున పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన హెల్త్‌కేర్ రంగంలో ఉద్యోగ కల్పన 7 శాతం అధికమవగా, వీరిలో అడ్మినిస్ట్రేటివ్ రోల్ సిబ్బందికి అధిక డిమాండ్ నెలకొన్నదని పేర్కొంది.

దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగం అంచనాలకుమించి దూసుకుపోతుండటంతో ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు అంతకంతకు పెరుగుతున్నాయని, ముఖ్యంగా గత నెలలోనూ 5 శాతం పెరిగాయని తెలిపింది. ముఖ్యంగా రెస్టారెంట్ మేనేజర్లు, సర్వీసు మేనేజర్లకు బెంగళూరు, ముంబైలలో డిమాండ్ ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. మరోవైపు, బీపీవో రంగంలో నియామకాలు 16 శాతం తగ్గగా, బీమా రంగంలోనూ 8 శాతం తగ్గాయని పేర్కొంది. అలాగే విద్య, రిటైల్ రంగంలో కూడా 7 శాతం చొప్పున తగ్గాయి. ఈ సందర్భంగా నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ అధికారి పవన్ గోయల్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సుతో కూడిన ఉద్యోగాలు పుంజుకోవడం ఐటీ రంగం పూర్తిగా మార్చివేసిందని, హెల్త్‌కేర్, ఆతిథ్య, ఎఫ్ఎంసీజీ విభాగాల్లో నియామక సెంటిమెంట్ ఆశాజనకంగా ఉన్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

