ITR Filing | వీళ్లు ఐటీఆర్-1 ఫైలింగ్‌కు అనర్హులు.. ఎందుకంటే?!
ITR Filing | ఐటీ రిటర్న్స్ గడువు దగ్గర పడుతున్నది. వేతన జీవులైనా కొన్ని సందర్భాల్లో ఐటీఆర్-1 ఫామ్ సమర్పించకూడదు.

ITR Filing | గత ఆర్థిక సంవత్సర (2020-21) ఐటీ రిటర్న్స్ సమర్పించిన వారిలో దాదాపు సగం మంది ఐటీఆర్-1 సబ్మిట్ చేశారు. ఐటీఆర్-1 సమర్పించిన వారిలో చాలామంది వేతన జీవులే. దీన్ని సహజ్ అని కూడా పిలుస్తారు. వేతన జీవుల్లో, ఇతర మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్న వారిలో ఐటీఆర్-1 పత్రాలు సమర్పించేందుకు అర్హులు.. అనర్హుల గురించి తెలుసుకుందాం..
ఎవరెవరు ఐటీఆర్-1 ఫామ్ సబ్మిట్ చేయాలంటే…!
- పన్ను చెల్లింపు దారు ఇండివిడ్యుయల్ రెసిడెంట్
- మొత్తం ఇన్‌కం రూ.50 లక్షలు దాటని వారు..
- వేతనం, ఒక ఇల్లుపై ఆదాయంతోపాటు రూ.5000 వరకు వ్యవసాయ ఆదాయం, సేవింగ్స్, డిపాజిట్లు, ఐటీ రిఫండ్, ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు.
- జీవిత భాగస్వామి.. కుటుంబంలో మైనర్ సభ్యుల ఆదాయం జత చేసినా..
- ఒకవేళ మీరు మీ జీవిత భాగస్వామి యాజమాన్యంతో ఒకే ఒక ఆస్తి కలిగి ఉన్నా ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.
- కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు ఐటీఆర్-1 ఫామ్ యూజ్ చేయకూడదు. పైన పేర్కొన్నట్లు ఆదాయం సంపాదిస్తున్నా.. సహజ్ పత్రాలను సమర్పించడానికి నిబంధనలు అనుమతించవు. ఎందుకో చూద్దామా..
వేతన జీవి అయినా ఐటీఆర్-1 ఎందుకు ఫైల్ చేయకూడదంటే..!
- అన్‌లిస్టెడ్ ఈక్విటీ సంస్థల్లో షేర్లలో నిధులు మదుపు చేసినా..ఒక కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నా..
- హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్)లో సభ్యులుగా ఉన్నా..
- విదేశీ కంపెనీలో వాటాలు కలిగి ఉన్నా..
- ఒకటి కంటే ఎక్కువ ఇండ్లు ఉన్నా (సొంతంగా అయినా.. ఉమ్మడిగానైనా)
- అర్హతగల స్టార్టప్ యజమానిగా ఉన్నా..
- ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఆదాయం రూ.5000 దాటినా..
- ఒకవేళ ప్రవాస భారతీయుడైతే (ఎన్ఆర్ఐ)
- (దీర్ఘకాలిక, స్వల్ప కాలిక) క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను చెల్లించినా..
- లాటరీలు, రౌస్ హౌస్‌లు, చట్టబద్ధమైన గ్యాంబ్లింగ్ ద్వారా ఆదాయం సంపాదించినా..
వ్యాపారం లేదా వృత్తిద్వారా ఆదాయం
వ్యాపారం లేదా ఏదైనా వృత్తి ద్వారా సంపాదించే ఆదాయం.. ఆదాయంపన్ను చట్టంలోని 194 ఎన్ సెక్షన్ ప్రకారం పన్ను డిడక్ట్ అవుతుంది. కొన్నినిర్దిష్ట పరిస్థితుల మధ్య పరిమితులు దాటి నగదు విత్ డ్రాయల్స్ జరిపితే ఐటీ చట్టం 194ఎన్ కింద పన్ను డిడక్ట్ అవుతుంది.
ఆ వేతన జీవులు వర్రీ చెందొద్దు..!
వేతన జీవులు ఐటీఆర్-1 ఫామ్ సమర్పించడానికి అనుకూల పరిస్థితులు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీల్లో వాటాల కొనుగోలు దారులు, ఎన్నారైలు, హెచ్‌యూఎఫ్ సభ్యులు తదితర క్యాటగిరీల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఐటీఆర్ సమర్పించడానికి విభిన్నమైన ఐటీఆర్ ఫామ్స్ దాఖలు చేయొచ్చు. ఉదాహరణకు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక క్యాపిటల్స్ నుంచి లాభాలు పొందిన వారు.. తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఐటీఆర్-2 సమర్పించొచ్చు. అలాగే వ్యక్తులు/ హెచ్‌యూఎఫ్ సభ్యులు వ్యాపారం, వృత్తుల ద్వారా సంపాదించే ఆదాయంపై ఐటీఆర్-3 సమర్పించొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- HUF
- it returns
- ITR-1
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

