WhatsApp | అకౌంట్ లాగిన్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలాగంటే..?!
WhatsApp | ఇక నుంచి వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్ లేకుండానే తమ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అందుకు ఈ-మెయిల్ (E-Mail) వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు.. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్నది. ఇక నుంచి వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్ లేకుండానే తమ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అందుకు ఈ-మెయిల్ (E-Mail) వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు.. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకూ కొత్త మొబైల్ నంబర్‌తో వాట్సాప్ లాగిన్ కావాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేయడం తప్పనిసరిగా ఉంది. ఇందుకోసం మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఆరంకెల ఓటీపీ నమోదు చేయాలి.
ఒక్కోసారి మొబైల్ ఫోన్ నంబర్ పని చేయకపోయినా, నెట్ వర్క్ సరిగా లేకున్నా ఓటీపీ రాదు. దీనికి ఆల్టర్నేటివ్గానే వాట్సాప్ లాగిన్ కోసం ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ కోసం ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

