WhatsApp | సింగిల్ క్లిక్ చేస్తే ఒకేసారి వాట్సాప్ రెండు అకౌంట్ల సేవలు.. ఎలాగంటే?!
WhatsApp | క్లోనింగ్ యాప్ లేదా బిజినెస్ యాప్ సాయం లేకుండా ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ అకౌంట్స్ సేవలను వాడుకునే వెసులుబాటు త్వరలో వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది.
WhatsApp | మన ఫోన్లో రెండు సిమ్ కార్డులతో ఒకేసారి వాట్సాప్ సేవలను వినియోగించుకోలేం. అలా చేయాలంటే క్లోనింగ్ యాప్ లేదా బిజినెస్ యాప్ వాడాలి. దానికి బదులు వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్ లో వాడుకునే చాన్స్ ఉంటే బాగుంటుంది కదా.. వాట్సాప్ కూడా తాజాగా ఒకటే యాప్ లో వేర్వేరు అకౌంట్లు నడుపుకునే ఫెసిలిటీ అందుబాటులోకి తెస్తున్నది.
తాజాగా వాట్సాప్ రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.23.13.5లో ఈ ఫీచర్ లీక్ అయింది. వాట్సాప్ అప్ డేట్స్ అనునిత్యం అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్ గుర్తించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలోనే ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ యాప్ లో ఈ ఫీచర్ కనిపించింది. త్వరలో రెగ్యులర్ యాప్ లో రానున్నదని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
ఒక వ్యక్తి కుటుంబం కోసం ఒక వాట్సాప్, ఆఫీసు పనులకు మరో వాట్సాప్ ఖాతా వాడుతున్నట్లయితే.. ఆ రెండు అకౌంట్లు నిర్వహించడానికి క్లోనింగ్ యాప్ కావాలి. కానీ వాట్సాప్ తెచ్చే ఫీచర్ సాయంతో సింగిల్ క్లిక్ తో అకౌంట్ల మధ్య స్విచ్ కావచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ మారిస్తే చాలు.. మీకు అవసరమైన అకౌంట్ తో వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

