ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కానీ కొందరు సమయం లేకపోవడం వల్లనో, ఇతర పనుల ఒత్తిడి కారణంగానో ఐటీఆర్‌లను పరిశీలించకుండానే దాఖలు చేస్తూంటారు. అలాంటప్పుడు దాన్ని ‘డిఫెక్టివ్ రిటర్న్’గా పరిగణిస్తారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(9) కింద ఆదాయ పన్ను శాఖ.. సదరు ఐటీఆర్‌ను దాఖలు చేసినవారికి నోటీసులనూ పంపుతుంది.
డిఫెక్టివ్ రిటర్న్ నోటీసు ఎలా వస్తుంది?
మీ ఐటీఆర్‌లో ఐటీ శాఖ అధికారులు తప్పుల్ని గుర్తిస్తే.. దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌గా చూస్తారు. సమాచార లోపం, గణాంకాల పొరబాట్లు, ఇతరత్రా తప్పులున్నందుకు నోటీసులిస్తారు. వీటినే డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులంటారు. సంబంధిత మదింపు సంవత్సరానికిగాను మీ పాన్ నంబర్నుద్దేశిస్తూ ఈ నోటీసును మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పంపుతారు. ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్లోనూ ఇది ఉంటుంది. ఈ నోటీస్.. పాస్‌వర్డ్‌తో ఉంటుంది. మీ పాన్ నంబర్, మీరు పుట్టిన తేదీయే పాస్వర్డ్. ఉదాహరణకు మీ పాన్ నంబర్ MNOPQ1212C, మీరు పుట్టిన తేదీ 12/12/1990. అప్పుడు మీ పాస్వర్డ్ MNOPQ1212C12121990.
ఈ కారణాలతో..
సమయంలోగా స్పందించాలి
డిఫెక్టివ్ రిటర్న్ నోటీసుల వల్ల ఐటీఆర్ దాఖలుదారులు తాము చేసిన తప్పులకు నష్టపోకుండా ఉండేందుకు వీలుంటుంది. అయితే సకాలంలో ఈ నోటీసులకు స్పందించకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి నోటీసు వచ్చిన 15 రోజుల్లోగా బదులివ్వాలి. ఒకవేళ ఈలోగా పని పూర్తి కాకుంటే కాలవ్యవధిని పొడిగించాలని విజ్ఞప్తి చేసుకోవచ్చు. అప్పటికీ పూర్తికాకపోతే మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా మీకేమైనా రిఫండ్స్ రావాల్సి ఉంటే ఆగిపోతాయి. అంతేగాక ఆలస్యానికిగాను వడ్డీ, జరిమానాల్నీ ఎదుర్కోవాల్సి రావచ్చు.