Home Loan | రుణానికి బీమా రక్ష.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలెన్నో..!
గృహ రుణం అంటే దీర్ఘకాల అప్పు. దీన్ని చెల్లించేటప్పుడు అనేక ఒడిదొడుకులు సహజం. అందుకే ఈ రుణానికి బీమా రక్షణ ఇవ్వడం తెలివైన పని అనిపించుకుంటుంది. అప్పుడే మనకు, మన కుటుంబ సభ్యులకు ప్రశాంతత అనేది ఉంటుంది.
Home Loan | గృహ రుణం అంటే దీర్ఘకాల అప్పు. దీన్ని చెల్లించేటప్పుడు అనేక ఒడిదొడుకులు సహజం. అందుకే ఈ రుణానికి బీమా రక్షణ ఇవ్వడం తెలివైన పని అనిపించుకుంటుంది. అప్పుడే మనకు, మన కుటుంబ సభ్యులకు ప్రశాంతత అనేది ఉంటుంది. నిజానికి రుణం తీసుకుంటే దానికి బీమాను కూడా తీసుకోవాలని అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)గానీ, ఇటు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐగానీ చెప్పడం లేదు. అయితే మన లాభం కోసం, మన కుటుంబ సభ్యులకు రుణ భారం లేకుండా ఉండేందుకు బీమా తీసుకోవడం ఉత్తమం.
హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అంటే?
హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌ను హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (హెచ్‌ఎల్‌పీపీ) అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్‌లను అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలన్నీ అందిస్తున్నాయి. మరణం, ఆరోగ్యం పాడైపోయి, ఏదైనా కారణం చేత అవయవాలు కోల్పోయి పనిచేయలేని స్థితికి రుణగ్రహీత చేరితే రుణ చెల్లింపుల సంగతిని బీమా సంస్థే చూసుకుంటుంది.
గృహ రుణ బీమా ప్రాముఖ్యత
రుణమిచ్చే బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. తమ రుణాలు మొండి బకాయిలుగా మిగిలిపోవాలని చూడవు. అందుకే రుణం తీసుకునేటప్పుడే దానికి బీమా కూడా తీసుకోవాలని రుణగ్రహీతకు ఆయా సంస్థలు చెప్తాయి. దాని ప్రాధాన్యతనూ వివరిస్తాయి. పైగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మునుపెన్నడూ లేనివిధంగా విజృంభించిన కరోనా మహమ్మారి.. మానవుల జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఎన్నో విధాలుగా వెనక్కినెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణ బీమా మన కుటుంబాలకు రక్షగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చనిపోయినా, పూర్తిగా అంగవైకల్యం బారినపడ్డా బీమా సంస్థే మన రుణ చెల్లింపుల్ని చేస్తుంది. దీనివల్ల మనం లేనిరోజున మనవాళ్లకు కనీసం సొంత ఇైల్లెనా దక్కుతుంది. అలాగే ఉద్యోగం కోల్పోయినా ఆసరాగా ఉంటుంది. అయితే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలి. మొక్కుబడిగా కాకుండా అన్ని ఫీచర్లున్న బీమాను కొనాలన్నది మర్చిపోవద్దు.
గుర్తుంచుకోండి..
ప్రీమియంలు
గృహ రుణ బీమా కవరేజీ ప్రీమియంను ఒకేసారి మొత్తంగా చెల్లించవచ్చు. లేదా హోమ్ లోన్ ఈఎంఐలతోపాటు నెలనెలా కొంత మొత్తాల్లోనూ చెల్లించవచ్చు.
జాయింట్ హౌజ్ లోన్
సంయుక్త గృహ రుణగ్రహీతలకూ ఈ బీమా ఉపయుక్తంగా ఉంటుంది. కో-అప్లికెంట్స్ అందరికీ ఇది వర్తిస్తుంది. అందువల్ల ఒకవేళ కుటుంబంలోని ముగ్గురు కలిసి రుణాన్ని తీసుకున్నా.. వారిలో దురదృష్టవశాత్తు ఒక్కరు అకాల మరణం పాలైనా బీమా కవరేజీని పొందవచ్చు.
రైడర్స్-యాడ్ ఆన్స్
బేసిక్ గృహ రుణ బీమాలో రుణగ్రహీత చనిపోతే చెల్లుబాటు అవుతుంది. అయినప్పటికీ రైడర్ స్కీమ్‌ను యాడ్ చేసుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సిందే. రుణగ్రహీతకు గుండెపోటు, క్యాన్సర్, ఇతర ప్రమాదకర గాయాలపాలైనా బీమా వర్తించగలదు. అంగవైకల్యానికి గురైనా లేదా ఉద్యోగం కోల్పోయినా, ఉపాధి కరువైనా 6 నెలలదాకా ఈఎంఐ చెల్లింపులకు యాడ్ ఆన్స్ కవరేజీని ఇవ్వగలవు.
బీమాలో రకాలు..
హైబ్రిడ్ ప్లాన్లు : హైబ్రిడ్ కవర్ ప్లాన్లలో బీమా కవరేజీ మొత్తం తొలి ఏడాది స్థిరంగా ఉంటుంది. అయితే రెండో ఏడాది నుంచి క్రమేణా కవరేజీ తగ్గిపోతూ ఉంటుంది. గృహ రుణ బకాయి మొత్తాలు కూడా తగ్గుతుండటమే దీనికి కారణం.
లెవల్ కవర్ ప్లాన్లు
గృహ రుణం కాల వ్యవధి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఈ లెవల్ కవర్ ప్లాన్లలో బీమా ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి. రుణ మొత్తాలు తగ్గుతున్నంత మాత్రాన బీమా కవరేజీ తగ్గిపోదు. కాబట్టి ముందే ఆలోచించి ప్లాన్లపై ఓ నిర్ణయం తీసుకోవాలి.
ప్రయోజనాలివే..
పన్ను ప్రోత్సాహకాలు
గృహ రుణగ్రహీతలు.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవడం వల్ల పన్ను ప్రోత్సాహకాలను అందుకోవచ్చు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద బీమా కోసం చెల్లించే ప్రీమియంలను పన్ను మినహాయింపునకు కోరవచ్చు.
కుటుంబ రక్షణ
కుటుంబ పెద్ద అకాల మరణం పాలైనప్పుడు.. గృహ రుణ భారం ఆ కుటుంబ సభ్యులపై పడకుండా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. కాబట్టి రుణం తీసుకున్నప్పుడు దానికి బీమా కూడా తీసుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది.
చివరగా.. ఇన్సూరెన్స్ ప్రీమియంలను రుణ మొత్తం, రీపేమెంట్ టెన్యూర్, రుణగ్రహీత వయస్సు, ఆరోగ్య పరిస్థితులు ప్రభావితం చేయగలవు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తిస్తుంది. అత్యుత్తమ బీమా కవరేజీనే తీసుకుంటున్నామా? అన్నదీ పరిశీలించుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్లు, పేమెంట్ పద్ధతిని కూడా కనుక్కోవడం మంచిది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

