ఆర్థిక క్రమశిక్షణతోనే సంపద సృష్టి

ఎవరైనా సాధారణంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకోరు. వారి అలవాట్లను ఎంచుకుంటారు. అయితే ఈ అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అవును.. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లే సంపద సృష్టికి చక్కని బాట వేస్తాయి మరి. ఆర్థిక స్థిరత్వానికీ దారులు చూపిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సరైన అలవాట్లతోనే సంపద సృష్టి సాధ్యం.
పొదుపు తప్పనిసరి
జీవితం పదిలంగా ఉండాలంటే ఎంతో కొంత పొదుపు నెలవారీగా చేయాల్సిందే. అద్దె, నెలసరి సరుకులు, బిల్లులు, వినోదం ఇవన్నీ ఎలాగూ ఉంటాయి. వాటి పరిమాణాన్ని నిర్ధారించుకోవాల్సింది మనమే. కాబట్టి ఎంత పొదుపు చేయగలిగితే అంత. పొదుపు మాత్రం తప్పనిసరి. రిటైర్మెంట్ సమయంలో ఎవరి మీదా ఆధారపడి ఉండకుండా ఉండేంతగా కార్పస్‌ను తయారు చేసుకోవాలి. అలాగే ఉద్యోగం లేకపోయినా కనీసం ఏడాది నుంచి రెండేండ్లదాకా లేదా మళ్లీ ఉద్యోగం వచ్చేంత వరకు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కుటుంబ అవసరాలు తీరేలా పొదుపు చేయాలి.
రుణాల ఊబిలోకి వెళ్లొద్దు
ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే అప్పులకు ఆమడ దూరం ఉండాల్సిందే. కొంతమందికి షాపింగ్ అంటే సరదా. అయితే క్రెడిట్ కార్డుల వినియోగం, వాయిదాల్లో కొనుగోళ్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. చిన్నచిన్న వస్తువులకు కూడా అప్పులు చేయడం మరిచిపోండి. ఉన్న డబ్బుతో కొనగలిగినవే కొనండి. ఒకరితో పోటీ వద్దు. వాయిదాల్లో కొనుగోళ్లకు అలవాటు పడితే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే.
డైవర్సిఫికేషన్
పొదుపు లేదా మదుపు.. అంతా ఒకే అసెట్‌లో కాకుండా వేర్వేరు సాధనాల్లో చేయాలి. తద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. ఈక్విటీలు, రుణ సాధనాలు, బంగారం, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్లు ఇలా అనేకరకాల ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవడంతోపాటు లక్ష్యానికి తగ్గట్టుగా ఆర్థిక స్వావలంభనను సాధించవచ్చు.
కుటుంబ మద్దతు

జీవితంలో కుటుంబమే ముఖ్యం. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే దేన్నీ సాధించలేం. వారు అర్థం చేసుకున్నంతగా మిగతావారు మనల్ని అర్థం చేసుకోలేరు. వారిని మించిన ఎమోషనల్ అడ్వయిజర్స్ మరొకరు ఉండరు. వారి దగ్గర ఆర్థిక విషయాలను దాచకండి. ఆర్థిక ప్రణాళికలో వారినీ భాగస్వాములను చేయండి. ఇలా చేయడం వల్ల సాధించలేనిది ఏమీ ఉండదు. దీనికితోడు మీ అవసరాలను గుర్తించగలిగి మీకు సరైన ఆర్థిక ప్రణాళికను ఇవ్వగలిగిన ఆర్థిక సలహాదారుడిని ఎంచుకోండి.
తప్పనిసరైతేనే అప్పు
కొన్ని రకాల అప్పులు తప్పనిసరి. ఉదాహరణకు హౌజింగ్ లోన్. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి గృహ రుణం తీసుకోక తప్పదు. ఇది దీర్ఘకాలానికి అతి తక్కువ వడ్డీతో చేసే అప్పు. ఇది తప్పనిసరి. దీనివల్ల లాభమేకానీ.. నష్టం లేదు. అలాగే పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే విద్యా రుణాలు. ఇది మనవారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు చేసే రుణం. దీనికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి ఎడ్యుకేషనల్ లోన్లూ తక్కువ వడ్డీకే లభిస్తాయి. అంతేగానీ సరదాలు, కోరికలు తీర్చుకోవడానికి అప్పుల జోలికి వెళ్లవద్దు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

