హైదరాబాద్ రియల్టీలోకి వారెన్ బఫెట్

- బెర్క్‌షైర్ హాత్వే నుంచి బ్రోకరేజ్ సర్వీసులు
- భాగ్యనగరానికి మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ
న్యూఢిల్లీ, జూలై 6: రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న మన హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక కంపెనీని ఆకర్షించింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న మన నగరానికి ప్రపంచంలోనే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే హోం సర్వీసెస్ కంపెనీ వస్తున్నది. ఇక్కడి రియల్టీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు మరో బ్రోకరేజ్ సంస్థ ఒరెండాతో జతకట్టింది. ‘బెర్క్‌షైర్ హాత్వే హోం సర్వీసెస్ ఒరెండా ఇండియా’ పేరుతో సంయుక్తంగా కీలక రియల్టీ మార్కైట్లెన హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో సేవలు అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది.
వెయ్యిమందితో నిపుణుల బృందం
2030 కల్లా 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న దేశ రియల్టీ మార్కెట్లో బెర్క్‌షైర్ హాత్వే విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని, వెయ్యికిపైగా రియల్ ఎస్టేట్ నిపుణులతో ఇక్కడ బృందాన్ని ఏర్పాటుచేస్తున్నామని హోం సర్వీసెస్ చైర్మన్ గినో తెలిపారు.
బెర్క్‌షైర్ హాత్వే కార్యకలాపాలివే..
బెర్క్‌షైర్ హాత్వే అమెరికాలోని ఒమాహా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పెద్ద కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతుంది. పలు సబ్సిడరీల ద్వారా దాదాపు 90 రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నది. అందులో ఒకటి హోం సర్వీసెస్. ఇది అమెరికా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ల్లో దిగ్గజం.

ఈ సంస్థ ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు తదితర రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సేవలతోపాటు తనఖా రుణాలు ఇప్పించటం, టైటిల్ ఇన్సూరెన్స్/ఎస్క్రో సేవలు, గృహ వారంటీలు, ఆస్తి బీమా, ప్రమాద బీమా సేవలను అందిస్తుంది.
హైదరాబాదే ఎందుకు?
సాఫ్ట్వేర్ మొదలు రియల్ ఎస్టేట్ రంగం వరకు అన్ని అంతర్జాతీయ సంస్థల చూపు హైదరాబాద్‌పైనే. ఇప్పటికే ఎన్నో ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలకు చోటిచ్చిన మన నగరంలో వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ కూడా అడుగుపెట్టబోతుండటం గమనార్హం. హైదరా బాద్‌లో భూములు అగ్గువకే దొరకటం, కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పించటం వంటి చర్యలతో కంపెనీలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

