Volkswagen Taigun GT Edge | హ్యుండాయ్ క్రెటా అడ్వెంచర్‌తో పోటీ.. మార్కెట్లోకి ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ఎడ్జ్.. ఇవీ డిటైల్స్..!
Volkswagen Taigun GT Edge | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ భారత్ మార్కెట్లోకి టైగూన్ జీటీ ఎడ్జ్ ట్రయల్ ఎడిషన్ ఆవిష్కరించింది
Volkswagen Taigun GT Edge | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ (Volkswagen) భారత్ మార్కెట్లోకి టైగూన్ జీటీ ఎడ్జ్ ట్రయల్ ఎడిషన్ (Volkswagen Taigun GT Edge) ఆవిష్కరించింది. ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ఎడిషన్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మిడ్ సైజ్ ఎస్యూవీ పరిమిత యూనిట్లు మాత్రమే మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 40కి పైగా సేఫ్టీ ఫీచర్లతో వస్తోందీ కారు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ఎడ్జ్ (Volkswagen Taigun GT Edge) కారు ధర రూ.16.29 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు కొనుక్కోవాలని ఆసక్తి గల వారు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫెస్టివ్ సీజన్ లో డెలివరీ చేస్తారు. టైగూన్ ట్రయల్ ఎడిషన్ కారు త్రీ కలర్ ఆప్షన్లు – క్యాండీ వైట్, రీఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్‌తో పోటీ పడుతుందీ ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ఎడ్జ్.
రెగ్యులర్ మోడల్ టైగూన్తో పోలిస్తే టైగూన్ జీటీ ఎడ్జ్ ట్రయల్ ఎడిషన్ కారు పలు మార్పులతో వస్తున్నది. క్రోమో స్ట్రిప్‌తోపాటు ఫ్రంట్‌లో ఆల్ బ్లాక్ గ్రిల్లే, ఫ్రంట్ బంపర్ మీద క్రోమ్ బార్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, రేర్ డోర్స్, ఫెండర్స్ మీద బాడీ స్టిక్కర్స్, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ ఫెండర్‌పై ‘ట్రయల్ బ్యాడ్జి’ ఉంటాయి.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ఎడ్జ్ కారు 1.5 లీటర్ల టీఎస్ఐ ఈవో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 150 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తోందీ కారు.
స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్‌తో స్పోర్టీ ఫీల్ కలిగిస్తుందీ కారు. ఇన్ బిల్ట్ ఎల్సీడీ డిస్ ప్లేతోపాటు డ్యుయల్ కెమెరా డాష్ కామ్, 10-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, 30 షేడ్స్ యాంబియెట్ లైటింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ కనెక్టివిటీ అండ్ చార్జింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ స్కప్ ప్లేట్స్, పనోరమిక్ సన్ రూఫ్, ఇల్యుమినేటెడ్ గేర్ నాబ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. మెమొరీ ఫంక్షన్ తోపాటు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్, ఫోక్స్ వ్యాగన్ కనెక్టెడ్ టెక్నాలజీ, జియో ఫెన్సింట్ ఫీచర్లు కూడా జత చేశారు.
6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), రివర్స్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, ఏబీఎస్, ఈఎస్పీ, ఏఎస్ఆర్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిస్కెంట్ కంట్రోల్ తదితర 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్నదీ కారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

